పకడ్బందీగా జొమాటో ప్యాకింగ్

Thu,March 21, 2019 12:58 AM

Zomato introduces tamper proof packaging in 10 cities

న్యూఢిల్లీ, మార్చి 20: ఆన్‌లైన్ రెస్టారెంట్ గైడ్, ఆర్డర్‌పై ఆహార పదార్థాల సరఫరా సంస్థ జొమాటో.. ట్యాంపర్-ప్రూఫ్ ప్యాకేజింగ్‌ను పరిచయం చేసింది. తొలి విడుతలో భాగంగా దేశవ్యాప్తంగా 10 నగరాల్లో ఈ రకమైన సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఫుడ్ డెలివరీ సేవల కోసం ఓ అదనపు లేయర్‌ను ప్యాకింగ్‌లో వినియోగిస్తామని స్పష్టం చేసింది. వస్తూత్పత్తులను ఎవరూ చూడకుండా, అలాగే డ్యామేజీల నుంచీ కాపాడుకునేలా పటిష్టమైన ప్యాకేజీ ఉంటుందని చెప్పింది. హైదరాబాద్, ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, పుణె, జైపూర్, చండీగఢ్, నాగ్‌పూర్, వడోదరల్లో ట్యాంపర్-ప్రూఫ్ ప్యాకేజీ సేవలు ఉంటాయని బుధవారం ఓ ప్రకటనలో జొమాటో తెలియజేసింది. క్రమంగా మొత్తం తాము సేవలు అందిస్తున్న 180 నగరాలకు ఈ సౌకర్యాన్ని విస్తరిస్తామన్న సంస్థ.. వినియోగదారులకు తాజా రుచిని, ఆరోగ్యాన్ని అందించడంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 5 వేలకుపైగా రెస్టారెంట్లు, హోటళ్లతో జొమాటో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నది.

710
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles