జీ ఎంటర్‌టైన్‌మెంట్

Thu,October 11, 2018 02:11 AM

Zee Entertainment Q2 profit falls 38 percent to Rs 386 cr but advt and subscription lift revenue 25 percent

తగ్గిన నికరలాభం,పెరిగిన ఆదాయం
ముంబై, అక్టోబర్ 10: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఆదాయం 13.98 శాతం పెరిగి రూ. 2,034.79 కోట్లకు చేరుకున్నప్పటికీ నికరలాభం 38.2 శాతం తగ్గి రూ. 386.10కోట్లకు క్షీణించింది. గత ఏడాది ఇదే కాలానికి రూ. 625.09 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం 22.7 శాతం పెరిగి రూ. 1,210.6 కోట్లకు చేరుకున్నట్టు జీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పునీత్ గోయెంకా తెలిపారు. కాగా, వ్యయాల్లో పన్ను చెల్లింపులు రూ. 148.9 కోట్ల నుంచి రూ. 262.4 కోట్లకు పెరుగడం వల్లనే లాభాలు క్షీణించాయని తెలిపారు.

1384
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles