5,999కే రెడ్మీ నోట్ 4ఏ

Tue,March 21, 2017 12:26 AM

-మార్కెట్లోకి ప్రవేశపెట్టిన షామీ
redmi
న్యూఢిల్లీ, మార్చి 20: చైనాకు చెందిన ప్రముఖ మొబైళ్ల తయారీ సంస్థ షామీ..దేశీయ మార్కెట్లోకి చౌక ధర కలిగిన 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. రెడ్మీ నోట్ 4ఏ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్ ధరను రూ.5,999గా నిర్ణయించింది. 5 అంగుళాల టచ్‌స్క్రీన్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16జీబీ మెమొరీ(128జీబీ వరకు పెంచుకోవచ్చును), ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, ముందుభాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరా, 3,120 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. నేడు విడుదల చేసినప్పటికీ ఈ నెల 23న మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్‌లో మాత్రమే లభ్యమవనున్నదని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో మరో యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు షామీ ఇండియా హెడ్ మను జైన్ తెలిపారు. ఫాక్స్‌కాన్‌తో కలిసి జూలై 2014లో ఇదివరకే సంస్థ ఇక్కడ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ కోసం ఎంతమేర పెట్టుబడులు పెట్టనున్న దానిపై ఆయన వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.

688

More News

మరిన్ని వార్తలు...