వండర్‌లా లాభంలో 90 శాతం వృద్ధి

Thu,May 16, 2019 02:18 AM

Wonderla Holidays standalone net profit rises 90 in the March 2019 quarter

హైదరాబాద్, మే 15: దేశంలో అతిపెద్ద అమ్యూజ్‌మెంట్ పార్క్ నిర్వహణ సంస్థ వండర్‌లా హాలీడేస్ లిమిటెడ్ గతేడాది చివరి త్రైమాసికంలో రూ.6.99 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.3.68 కోట్ల తో పోలిస్తే 90 శాతం పెరుగుదల కనిపించింది. జనవరి-మార్చి మధ్యకాలంలో కంపెనీకి రూ.63.55 కోట్ల ఆదాయం సమకూరింది. గడిచిన త్రైమాసికంలో బెంగళూరులో ఉన్న పార్క్‌ను సందర్శించిన వారిలో 10 శాతం పెరుగుదల కనిపించగా, అదే హైదరాబాద్, కొచ్చి పార్క్‌ల్లో 5 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా ఉన్న మూడు పార్కులు, రిసార్ట్‌లు మెరుగైన పనితీరు కనబరిచినట్లు కంపెనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జార్ట్ జోసెఫ్ తెలిపారు. గతేడాది మొత్తానికి రూ.291.66 కోట్ల ఆదాయంపై రూ.55.41 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకున్నది.

2051
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles