దూకుడు పెంచిన స్పైస్‌జెట్

Sat,April 13, 2019 02:23 AM

Will induct 16 Boeing 737 800 NG aircraft on dry lease SpiceJet

-16 బోయింగ్ 737-800 ఎన్‌జీ విమానాల లీజుకు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: జెట్ ఎయిర్‌వేస్ ఆర్థిక సంక్షోభం..బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల నిలిపివేతతో భారత్‌లో విమానాల సర్వీసుల కొరత ఏర్పడింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు స్పైస్‌జెట్ విమానాల సంఖ్యను పెంచుకునే పనిలో పడింది. ఒకేసారి 16 బోయింగ్ 737-800 ఎన్‌జీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను లీజుకు తీసుకోబోతున్నట్లు శుక్రవారం సంస్థ ప్రకటించింది. డ్రై లీజు కింద తీసుకోబోతున్న ఈ విమానాలను దిగుమతి చేసుకోవడానికి అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం పౌర విమానయాన నియంత్రణ మండలి డీజీసీఏకి దరఖాస్తు చేసుకున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. డీజీసీఏ అనుమతిస్తే వచ్చే పది రోజుల్లో ఈ విమానాలు కంపెనీలో చేరనున్నాయని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు. రుణ సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్ ఇప్పటికే 90 శాతానికి పైగా విమాన సర్వీసులను నిలిపివేయడంతో ఇతర విమాన సర్వీసులకు డిమాండ్ పెరిగింది.

దీంతోపాటు గత నెలలో ఇథియోపియాలో జరిగిన విమాన ప్రమాదంతో భద్రత కారణాల దృష్ట్యా బోయింగ్ 737 మ్యాక్స్ సర్వీసులను రద్దు చేసుకోవాలని అన్ని విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీంతో కంపెనీ షేరు ధర ఒక్కసారిగా భారీగా పుంజుకున్నది. ఒక దశలో 10 శాతానికి పైగా లాభపడిన కంపెనీ షేరు ధర చివరకు 8.5 శాతం లాభంతో రూ.109.90 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.518.90 కోట్లు పెరిగి రూ.6,590.90 కోట్లకు చేరుకున్నది.

548
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles