తగ్గిన టోకు ద్రవ్యోల్బణం

Wed,August 15, 2018 12:26 AM

Wholesale Price Index based inflation has further decreased

-జూలైలో 5.09 శాతం
న్యూఢిల్లీ, ఆగస్టు 14: టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం మరింత తగ్గింది. ప్రధానంగా పండ్లు, కూరగాయల ధరలు భారీగా తగ్గడంతో జూలై నెలకుగాను టోకు ధరల సూచీ 5.09 శాతానికి పరిమితమైంది. జూన్‌లో ఇది 5.77 శాతంగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 1.88 శాతంతో పోలిస్తే భారీగా పెరిగింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆహార పదార్థాల ధరల సూచీ రుణాత్మకం 2.16 శాతానికి పడిపోయింది. వీటితోపాటు కూరగాయల సూచీ 14.07 శాతం, పండ్ల సూచీ 8.81 శాతం, పప్పు దినుసుల సూచీ 17.03 శాతం మేర తగ్గాయి. ఆహారేతర ఉత్పత్తుల ధరల సూచీ మాత్రం 3.81 శాతం నుంచి 3.96 శాతానికి పెరుగగా, చమురు ధరల గణాంకాలు 18.10 శాతానికి, తయారీ రంగ సూచీ 4.26 శాతానికి చేరుకున్నాయి. గతేడాది భగ్గుమన్న ఆహార పదార్థాల ధరలు ఈసారి భారీగా తగ్గాయని, ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, పప్పు దినుసులు శాంతించడంతో సామాన్యుడికి భారీ ఊరట లభించినట్లు అయిందని ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదిత్ నాయర్ తెలిపారు.

493
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles