రోజువారి సేవల కోసం విజ్జీ యాప్

Thu,January 24, 2019 12:22 AM

హైదరాబాద్, జనవరి 23: రోజువారి అవసరాలకోసం మరో యాప్ అందుబాటులోకి వచ్చిం ది. హైదరాబాద్ కేంద్రస్థానంగా టెక్నాలజీ సేవలు అందిస్తున్న విజ్జీ లాజిస్టిక్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్..విజ్జీ పేరుతో మొబైల్ అప్లికేషన్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా కంపెనీ ప్రమోటర్ రవి గొల్లపుడి మాట్లాడుతూ..గృహాస్తులు, చిన్నస్థాయి వ్యాపారవేత్తలకు బుకింగ్ చేసుకున్న వస్తువులను సరఫరా చేయాలనే ఉద్దేశంతో ఈ అప్లికేషన్‌ను రూపొందించినట్లు చెప్పారు. ఈ యాప్ ద్వారా ఏ వస్తువైన, ఏ సమయంలోనైనా వినియోగదారుడు నుంచి పిక్-అప్ చేసుకొని అందచేయడం జరుగుతుందన్నారు. ఇందుకోసం మూడు కిలోమీటర్ల వరకు రూ.20 చార్జీ చేయనున్న సంస్థ.. ఆ తర్వాతి నుంచి ఒక్కో కిలోమీటర్‌కు రూ.10 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం సంస్థ 15 మంది డెలివరీ బాయ్స్ ఉండగా, ఈ ఏడాది చివరినాటికి సంఖ్యను భారీగా పెంచుకోనున్నట్లు ప్రకటించారు.

1173
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles