మోన్‌శాంటో చేసే ప్రచారంలో నిజం లేదు: నూజివీడు సీడ్స్

Wed,January 9, 2019 11:33 PM

What the Supreme Court Said in Its Bt Cotton Judgment

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జన్యుమార్పిడి బీటీ రకం పత్తి విత్తనాలపై మోన్‌శాంటో సంస్థకున్న పేటెంట్లు చెల్లవంటూ ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టిందంటూ సంస్థ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని నూజివీడు సీడ్స్ సెక్రటరీ, కార్పోరేట్ లీగల్ హెడ్ ఎన్ మురళీకృష్ణ స్ప ష్టం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. బీటీ పత్తి విత్తనాల విక్రయా ల పేటెంట్ విషయంలో నూజివీడు సీడ్స్, మోన్‌శాంటోకు మధ్య వివాదం సుప్రీంకోర్టులో ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం సుప్రీంకోర్టు ఈ అంశంపై ఇచ్చిన తీర్పును మోన్‌శాంటో కంపెనీ తమకు అనుకూలంగా మీడియాలో ప్రచారం చేసుకుంటున్నదని మురళీకృష్ణ పేర్కొన్నారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును బుధవారం మధ్యాహ్నం 4.45 గంటలకు అప్‌లోడ్ చేస్తే, అంతకంటే ముందే కొన్ని మీడియాలో, సోషల్‌మీడియాల్లో తప్పుడు వార్తలు ప్రచారం చేశారని పేర్కొన్నారు.

598
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles