రాజభోగాలు..!

Sat,June 8, 2019 01:01 AM

What Ex IL And FS top brass got for loans

-విదేశీ టూర్లు, ప్రైవేట్ జెట్లు, చాపర్లలో ప్రయాణాలు
-ఇది ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ మాజీ బాసుల తీరు

న్యూఢిల్లీ, జూన్ 7: కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్న చందంగా తయారైంది ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఆర్థిక సంక్షోభ పరిస్థితి. కంపెనీని అన్నింటా ముందువుండి నడిపించాల్సిన మాజీ బాసులే సంస్థ దివాలా తీయడానికి కారణమయ్యారు. భారీ స్థాయిలో రుణాలు ఇప్పించడం, విదేశీ ప్రయాణాలు, ప్రైవేట్ జెట్ విమానాల్లో ప్రయాణం, చాపర్లలో రైడింగ్‌లు, తమ ఇండ్లలో అంతర్గత అలంకరణ చేసుకున్నారట. తమ అనూహ్యంగులకు రుణాలు ఇప్పించడంలో చొరవ చూపించిన మాజీ బాసులు..వీటిని రికవరీ చేయడంలో మాత్రం విఫలమయ్యారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో జరిగిన అవినీతి గురించి వైట్-కాలర్ మోసాలను గుర్తించే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్ట్‌గేషన్(ఎస్‌ఎఫ్‌ఐవో)లో పలు కీలక సమాచారాన్ని సేకరించింది. సంస్థను ఆర్థికంగా దివాలా తీయడానికి ఇతర సంస్థలకు ఇచ్చిన రుణాలు కావని, కంపెనీ ఉన్నతాధికారులు మింగిన భారీ నిధులే కారణమని పేర్కొంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు చెందిన అనుబంధ సంస్థయైన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(ఐఎఫ్‌ఐఎన్) నుంచి భారీ స్థాయిలో రుణాలు తీసుకున్నారని ఎస్‌ఎఫ్‌ఐవో గుర్తించింది. ఐఎఫ్‌ఐఎన్ ఉన్నతాధికారులకు, సంస్థ వద్ద రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన కంపెనీ బాసులతో జరిగిన ఈ-మెయిల్స్ ద్వారా పలు కీలక సమాచారాన్ని సేకరించింది ఎస్‌ఎఫ్‌ఐవో. ముఖ్యంగా శివా గ్రూపు చైర్మన్ సీ శివశంకరణ్‌తో కంపెనీ ఉన్నతాధికారులు జరిపిన ఈ-మెయిల్స్ చూస్తే ఎలా మోసం చేశారో స్పష్టమవుతున్నది. ఆయనకు ఉన్న 15 కంపెనీలకుగాను రుణాన్ని మంజూరు చేసింది. ఇందుకు ప్రతిఫలంగా కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లైన రవి పార్థసారథి, విభవ్ కపూర్, హరి శంకరణలకు ప్రముఖ ఆసుపత్రుల్లో చికిత్స కూడా చేపించాడు. వీటితోపాటు విదేశీ పర్యటనలు, ప్రైవేట్ జెట్ విమానాలు సమకూర్చడం, హెలిక్యాప్టర్ రైడ్స్, రిసార్ట్‌లలో విలాసాలు, బెల్జియంలో ఉన్న వీరికి చెందిన భవంతుల్లో అంతర్గత అలంకరణ కూడా చేపిచ్చాడట. శివ గ్రూపుతో పార్థసారథి, హరి శంకరన్‌కు వ్యక్తిగత సంబంధాలు నెరిపారు.

పాతవి తీర్చకున్నా.. కొత్తగా రుణాలు..

శివ గ్రూపు తీసుకున్న పాత రుణాలకు ఎలాంటి చెల్లింపులు జరుపకపోయినప్పటికీ కొత్తగా రుణాలు ఇచ్చారు ఈ ముగ్గురు ప్రముఖులు. ప్రస్తుతం ఇవి నిరర్థక ఆస్తులుగా మారాయి. ఈ గ్రూపు ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ కోట్లాది రూపాయలు రుణాలు మంజూరు చేయడం ప్రస్తుతం ఎస్‌ఎఫ్‌ఐవో అధికారులు విస్తుపోతున్నారు. మార్చి 2018 నాటికి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూపు మొత్తానికి రూ.90 వేల కోట్ల అప్పు ఉన్నది. సంస్థ ఇచ్చిన 400 కంపెనీల రుణాలను తనిఖీ చేసిన ఎఫ్‌ఎఫ్‌ఐవో గత వారంలో తన తొలి చార్జీషీట్‌ను దాఖలు చేసింది.

2329
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles