ఏడాదిలోగా రాష్ట్రంలో మరో 20 స్టోర్లు

Fri,October 13, 2017 01:02 AM

We will have another 20 stores across the state in the next year says shankar ram

పెప్స్ జాయింట్ ఎండీ శంకర్ రామ్
peps
హైదరాబాద్, అక్టోబర్ 12: ప్రముఖ పరుపుల విక్రయ సంస్థ పెప్స్ ఇండస్ట్రీస్ విస్తరణ బాట పట్టింది. వచ్చే ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మరో 20 స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శంకర్ రామ్ తెలిపారు. హైదరాబాద్‌లో కంపెనీ ఏర్పాటు చేసిన రిటైల్ అవుట్‌లెట్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..హైదరాబాద్‌లో ఇప్పటికే ఆరు స్టోర్లను ప్రారంభించగా, వీటిలో రెండు సొంతవికాగా, మిగతావి ప్రాంఛైజ్ పద్ధతిన ఏర్పాటుచేసినట్లు చెప్పారు. నూతనంగా ఏర్పాటు చేసిన అవుట్‌లెట్‌లో రూ.7 వేలు మొదలుకొని రూ.1.5 లక్షల వరకు పరుపులు లభించనున్నాయన్నారు. ప్రారంభ ఆఫర్ కింద పలు రాయితీలు ఇస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.235 కోట్లుగా నమోదైన టర్నోవర్, ఈ ఏడాది రూ.330 కోట్లకు చేరుకోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

208

More News

VIRAL NEWS

Featured Articles