ఉద్దీపనలతో ఊతమివ్వాలి

Tue,October 17, 2017 12:45 AM

We Need to Boost Monetary Stimulus for Slow Growth says Rajeev Kumar

-ఉత్పాదకత, మూలధన వ్యయ పెంపునకు మాత్రమే ఉపయోగించాలి
-నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్
rajeevkumar
న్యూఢిల్లీ, అక్టోబర్ 16: మందగించిన వృద్ధికి ద్రవ్య ఉద్దీపనలతో ఊతమివ్వాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు. అయితే, ఉద్దీపన ప్యాకేజీ నిధులను ఉత్పాదకత, మూలధన వ్యయాన్ని పెంచేందుకు మాత్రమే ఉపయోగించాలని ఆయన సూచించారు. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో వృద్ధిరేటు మూడేండ్ల కనిష్ఠ స్థాయి 5.7 శాతానికి పడిపోయిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను మళ్లీ పునరుద్ధరణబాట పట్టించేందుకు ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని ఇండస్ట్రీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం త్వరలోనే రూ.40 వేల కోట్లకు పైగా విలువ చేసే భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించవచ్చన్న ఊహాగానాలు మార్కెట్లో చక్కర్లు కొట్టాయి. ఈ విషయంపై ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వార్షిక సదస్సులో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ.. వృద్ధికి ఊతమిచ్చేందుకు ద్రవ్య ఉద్దీపనలు ప్రకటిస్తామని ఏనాడూ చెప్పలేదని, పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తామని మాత్రమే చెప్పినట్లు వివరణ ఇచ్చుకున్నారు. ఉద్దీపన ప్యాకేజీల గురించి మీడియాలో వచ్చిన కథనాల గురించి వారినే అడుగాలని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఉద్దీపనల అవశ్యకతపై రాజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

179
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS