గిడ్డంగుల్లోకి నిధుల వరద

Tue,December 3, 2019 12:35 AM

-2017 నుంచి రూ.25 వేల కోట్ల పెట్టుబడి
-2021 నాటికి రూ.49,500 కోట్లకు చేరుకోనున్నట్లు అంచనా

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: గిడ్డంగులు భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకట్టుకుంటున్నాయి. గడిచిన మూడేండ్లలో రూ.25 వేల కోట్ల మేర పెట్టుబడులను ఆకట్టుకున్న ఈ రంగం..వచ్చే మూడేండ్లలో ఇది రూ.49,500 కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయని సర్వే వెల్లడించింది. ఈ కామర్స్ కంపెనీలు తమ వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించడంతో లాజిస్టిక్ స్థలానికి అనూహ్యంగా డిమాండ్ నెలకొన్నదని అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెన్సీ కోలియర్ వెల్లడించింది. 2017 నుంచి భారత్‌లో ఇండస్ట్రీయల్, వేర్‌హౌజింగ్ విభాగాలు అత్యధికంగా పెట్టుబడులను ఆకట్టుకుంటున్నాయని, ముఖ్యంగా ఈ-కామర్స్ సేవలు ఊపందుకోవడం, వినియోగదారులకు సంబంధించిన విభాగాలకు అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకోవడం ఇందుకు కారణమని తెలిపింది. దేశీయ ఆర్థిక పరిస్థితులు నిరుత్సాహంగా ఉన్నప్పటికీ ఈ రెండు రంగాలు దూసుకుపోతున్నాయని, పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంత వాసులు ఆన్‌లైన్‌లోనే అన్ని వస్తువులు కొనుగోలు చేయడంతో ఈ-కామర్స్ సేవలకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. దీంతో ఈ-కామర్స్ సంస్థలు కొనుగోలుదారులకు తక్కువ సమయంలోనే బుకింగ్ చేసుకున్న వస్తువులను అందించడానికి భారీగా గిడ్డంగులను ఏర్పాటు చేసుకున్నాయి. గిడ్డంగులను లీజుకు తీసుకోవడానికి దేశంలోవున్న అతిపెద్ద కంపెనీలు ఆసక్తి చూపడం, ముఖ్యంగా ఈ-కామర్స్‌తోపాటు 3పీఎల్(థర్డ్-పార్టీ లాజిస్టిక్) విభాగాల నుంచి అధిక డిమాండ్ ఉండటం, ముంబై, పుణెలలో మైక్రోమేకర్స్‌ను తయారు చేయడానికి ఆసక్తి చూపినట్లు కోలియర్స్ ఇంటర్నేషనల్ ఇండియా సీఎండీ సంకే ప్రసాద్ తెలిపారు. గిడ్డంగులను ఏర్పాటుకు సంబంధించి పెట్టుబడులను బెంగళూరు అత్యధికంగా ఆకట్టుకుంటున్నదని, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పన్నులను ఎత్తివేయడం ఇందుకు కారణమని ఆయన చెప్పారు. ప్రభుత్వాలు ప్రకటించిన పాలసీల్లో భాగంగా ప్రవేశపెట్టిన జీఎస్టీ, మేక్ ఇన్ ఇండియా పథకం వేర్‌హౌజింగ్ రంగం భారీ పెట్టుబడులను ఆకట్టుకుంటున్నాయి.

305
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles