వొడాఫోన్-ఐడియా నష్టం 5 వేల కోట్లు

Thu,February 7, 2019 12:30 AM

Vodafone Idea Q3 net loss widens to Rs 5004.6 crore

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: దేశీయ టెలికం రంగంలో అతిపెద్ద సంస్థగా అవతరించిన వొడాఫోన్-ఐడియా భారీ నష్టాలను నమోదు చేసుకున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.5,005.7 కోట్ల నష్టం వచ్చినట్లు ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో రూ.1,284.5 కోట్లుగా ఉన్నది. వొడాఫోన్-ఐడియాల విలీనం ఆగస్టు 31, 2018 నుంచి అమలులోకి రావడంతో గతేడాది నమోదైన ఆర్థిక ఫలితాలతో పోల్చుకోవాల్సిన అవసరం లేదని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. మొదటి రెండు త్రైమాసికాల్లో నమోదైన నష్టలతో పోలిస్తే మరింత పెరిగింది. సమీక్షకాలంలో కంపెనీ రూ.11,982 .80 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో వచ్చిన రూ.7,878.6 కోట్లదాంతో పోలిస్తే 52 శాతం పెరుగడం విశేషం. గడిచిన త్రైమాసికంలో ఫలితాలు చూస్తే ప్రోత్సహకరంగా ఉన్నాయని, ఇంటిగ్రేషన్, నెట్‌వర్క్ విస్తరణ పనులను వేగవంతం చేసినట్లు వొడాఫోన్ ఐడియా సీఈవో బాలేష్ శర్మ తెలిపారు. 4జీ వినియోగదారులను మరింత మందిని ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో 4జీ నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించనున్నట్లు ఆయన ప్రకటించారు.

1691
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles