వొడాఫోన్ ఐడియా నష్టం రూ.4,882 కోట్లు

Tue,May 14, 2019 12:38 AM

Vodafone Idea loss at Rs 4881.9 crore in Q4

న్యూఢిల్లీ, మే 13: దేశంలో అతిపెద్ద టెలికం నెట్‌వర్క్ కలిగిన వొడాఫోన్ ఐడియా నష్టాల పరంపర కొనసాగుతున్నది. మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికిగాను సంస్థ రూ.4,881.90 కోట్ల నష్టాన్ని చవిచూసింది. దేశీయ మొబైల్ మార్కెట్ల టారిఫ్ యుద్ధం కొనసాగుతుండటం సంస్థ నష్టాలను అమాంతం పెంచింది. 2018-19 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నమోదైన రూ.5,004.60 కోట్ల నష్టానికి చేరువగా ఉన్నది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదై రూ.962.20 కోట్ల నష్టంతో పోల్చుకోవాల్సిన అవసరం లేదని, దేశీయ యూనిట్‌లో ఐడియా సెల్యులార్ విలీనం కావడం ఇందుకు కారణమని విశ్లేషించింది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోతో సంస్థ తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నది. గడిచిన త్రైమాసికంలో కంపెనీ రూ.11,775 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. విలీనానికి ముందు నిలకడైన వృద్ధిని నమోదు చేసుకున్న సంస్థ వచ్చే రెండేండ్లలో లాభాల్లోకి రావడానికి ప్రయత్నించనున్నట్లు వొడాఫోన్ ఐడియా సీఈవో బాలేష్ శర్మ తెలిపారు. ఇందుకోసం 4జీ నెట్‌వర్క్‌ను విస్తరించడంతోపాటు ఈ విభాగ వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు చెప్పారు. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.37,092.50 కోట్ల ఆదాయంపై రూ.14,603.90 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది. ఒక్కో వినియోగదారుడి నుంచి సమకూరిన ఆదాయం రూ.104గా ఉన్నది. నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో కంపెనీ షేరు ధర 3.21 శాతం తగ్గి రూ.14.45 వద్ద ముగిసింది.

811
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles