Telangana Intermediate 1st & 2nd Year Results 2019

25 వేల కోట్ల రైట్ ఇష్యూకి వొడాఫోన్-ఐడియా బోర్డు గ్రీన్‌సిగ్నల్

Thu,March 21, 2019 01:05 AM

Voda Idea board okays Rs 25,000 crore rights issue

న్యూఢిల్లీ, మార్చి 20: దేశీయ టెలికం దిగ్గజం వొడాఫోన్-ఐడియా భారీ స్థాయిలో నిధుల సేకరణకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రైట్ ఇష్యూ ద్వారా రూ.25 వేల కోట్లను సేకరించాలని గతంలోనే కంపెనీ సంకల్పించింది. ఈక్విటీ షేరు ధరను రూ.12.50గా నిర్ణయించింది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ జరుగుతున్న షేరు కంటే 61 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నది. ఇందుకోసం సంస్థ 2 వేల కోట్ల నూతన షేర్లను జారీ చేయనున్నది. వచ్చే నెల 10 నుంచి 24 వరకు ఈ ఇష్యూ కొనసాగనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే 38 షేర్లు ఉన్న వాటాదారులు కొత్తగా 87 షేర్లను కొనుగోలు చేయవచ్చును.

ఈ రైట్ ఇష్యూ ద్వారా సేకరించనున్న రూ.25 వేల కోట్ల నిధులను 4జీ పరిధిని మరింత విస్తరించడానికి, 5జీ సేవలు అందించడానికి వినియోగించనున్నట్లు సంస్థ ప్రకటించింది. రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి సంస్థ భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. డిసెంబర్ 31, 2018 నాటికి కంపెనీ రూ.1,23,660 కోట్ల స్థాయిలో అప్పు ఉన్నది. ఈ జాయింట్ వెంచర్‌లో వొడాఫోన్‌కు 45.1 శాతం వాటా ఉండగా, ఆదిత్యా బిర్లా గ్రూపునకు 26 శాతం, ఐడియా వాటాదారులకు 28.9 శాతం వాటా ఉన్నది. ఇంట్రాడేలో 7 శాతానికి పైగా నష్టపోయిన వొడాఫోన్ ఐడియా షేరు ధర చివరకు 3.13 శాతం నష్టంతో రూ.33 వద్ద ముగిసింది.

610
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles