క్రికెట్ చూడ్డానికి వచ్చా..!

Mon,June 10, 2019 12:26 AM

Vijay Mallya Spotted At India vs Australia World Cup Match In London

-ఐసీసీ వరల్డ్ కప్ భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో మాల్యా
లండన్, జూన్ 9: ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లను చూస్తున్నారు విజయ్ మాల్యా. ఆదివారం ఇక్కడి ఓవల్ స్టేడియంలో జరిగిన భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ను మాల్యా తిలకించారు. టిక్కెట్‌తో స్టేడియంలోకి వెళ్తూ.. నేను గేమ్‌ను చూసేందుకు ఇక్కడికి వచ్చాను అన్నారు. 63 ఏండ్ల విజయ్ మాల్యాపై భారత్‌కు అప్పగింత విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ అధినేత భారతీయ బ్యాంకులకు రూ.9 వేల కోట్లకుపైగా బకాయిపడి, వాటిని ఎగవేసి 2016లో లండన్‌కు పారిపోయిన సంగతీ విదితమే. కాగా, మొదట్నుంచి క్రికెట్ అంటే బాగా ఇష్టపడే మాల్యా.. ప్రస్తుత ఐసీసీ వరల్డ్ కప్ లండన్ వేదికగానే జరుగుతుండటంతో తెగ ఎంజా య్ చేసేస్తున్నారు. సెంట్రల్ లండన్‌లో గత శుక్రవారం ప్రారంభమైన ఊటీ స్టేషన్ అనే ఇండియన్ రెస్టారెంట్-స్పోర్ట్స్ బార్‌లో క్రికెట్ మ్యాచ్‌లను చూస్తూ ఉండిపోతున్నారు. అయితే భారత్ ఆడే మ్యాచ్‌లను మాత్రం స్టేడియంలకు వెళ్లి మరి వీక్షిస్తుండటం గమనార్హం. మరోవైపు బ్యాంకులకు తాను ఇవ్వాల్సిన బకాయిలను పూర్తిగా చెల్లిస్తానని వీలు చిక్కినప్పుడల్లా మాల్యా ఏకరువు పెడుతూనే ఉన్నారు.

3332
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles