మరో 10 శాతం సుంకాలు

Wed,July 11, 2018 11:57 PM

US unveils 200 billion list of China imports for tariffs

-చైనా దిగుమతులపై అమెరికా ప్రకటన
-వాణిజ్య యుద్ధం తీవ్రరూపం

వాషింగ్టన్/బీజింగ్, జూలై 11: అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. మరో 200 బిలియన్ డాలర్ల (రూ.13,75,200 కోట్లు) విలువైన చైనా దిగుమతులపై ట్రంప్ సర్కారు బుధవారం 10 శాతం సుంకాలను ప్రకటించింది. దీంతో ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సుంకాల సమరం తారాస్థాయిని తాకినైట్లెంది. గత శుక్రవారం 34 బిలియన్ డాలర్ల (రూ.2,33,684 కోట్లు) విలువైన చైనా ఉత్పత్తులపై 25 శాతం సుంకాలను అమెరికా విధించిన విషయం తెలిసిందే. దీంతో చైనా సైతం ఇదే స్థాయిలో ప్రతీకార సుంకాలకు దిగగా, అమెరికా నుంచి దిగుమతయ్యే కార్లతోపాటు సోయాబీన్స్, మాంసం వంటి ప్రధాన వ్యవసాయోత్పత్తులపై సుంకాలను వేసింది. ఈ క్రమంలో అమెరికా మరోసారి విరుచుకుపడింది. సుమారు రూ.14 లక్షల కోట్ల విలువైన చైనా దిగుమతులపై అదనంగా మరో 10 శాతం సుంకాలను బాదింది. దీనికి సంబంధించి అమెరికా క్యాబినెట్ స్థాయి అధికారి, అక్కడి ట్రేడ్ రిప్రజెంటేటివ్ రాబర్ట్ లైథీజర్ ఓ జాబితాను విడుదల చేశారు. ఇందులో పండ్లు, కూరగాయలు, చేతిసంచులు, రిఫ్రిజిరేటర్లు, రెయిర్ జాకెట్లు, బేస్‌బాల్ గ్లోవ్స్ తదితర భారీ సంఖ్యలో ఉత్పత్తులున్నాయి. మరోవైపు ఈ సుంకాలకు చైనా అక్రమ వాణిజ్య కార్యకలాపాలదే బాధ్యతని వైట్ హౌజ్ స్పష్టం చేసింది.

694
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles