238 బిలియన్ డాలర్లకు చేరొచ్చు

Fri,July 12, 2019 02:17 AM

US India bilateral trade could reach USD 238 billion by 2025 USISPF

2025కల్లా ఇండో-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యంపై యూఎస్‌ఐఎస్‌పీఎఫ్ అంచనా
వాషింగ్టన్, జూలై 11: భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2025కల్లా 238 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అమెరికా-భారత్ వ్యూహాత్మక, భాగస్వామ్య మండలి (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్) అంచనా వేసింది. ప్రస్తుతం 143 బిలియన్ డాలర్లుగానే ఉండగా, మరో ఆరేండ్లలో ఇది దాదాపు 100 బిలియన్ డాలర్ల మేర పెరుగవచ్చన్నది. ఇరు దేశాల మధ్య ఏటా వాణిజ్యం 7.5 శాతం వృద్ధి చెందితే.. తమ అంచనా సాధ్యమేనని గురువారం మండలి రెండో వార్షిక నాయకత్వ సదస్సు సందర్భంగా విడుదల చేసిన నివేదికలో అభిప్రాయపడింది. గత రెండేండ్లు నమోదైన వార్షిక సగటు వృద్ధి 10-12.5 శాతం రేటు కొనసాగితే 327 బిలియన్ డాలర్లను తాకుతుందని పేర్కొన్నది.


నేడు వాణిజ్య అంశాలపై చర్చ

శుక్రవారం ఢిల్లీలో భారత్, అమెరికా దేశాల సీనియర్ అధికారులు వాణిజ్య అంశాలపై చర్చించనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో భాగంగా వివిధ ఆర్థిక అంశాలపైనా చర్చ జరుపుతారని తెలుస్తున్నది. ఈ సందర్భంగా దక్షిణ, మధ్య ఆసియా దేశాలకు అమెరికా అసిస్టెంట్ వాణిజ్య ప్రతినిధి నేతృత్వంలోని అమెరికా అధికారుల బృందం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్‌ను కలుసుకోనున్నది. మొత్తానికి భారత్ పన్నులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, భారత్‌కు ప్రాధాన్య వాణిజ్య హోదా (జీఎస్పీ) దూరమైన క్రమంలో, అమెరికా నుంచి దిగుమతి అవుతున్న 28 రకాల ఉత్పత్తులపై భారత్ సుంకాలను పెంచిన దశలో జరుగుతున్న ఈ సమావేశం ఇప్పుడు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నది.

234
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles