అప్రకటిత ఆస్తులు రూ.6 వేల కోట్లు

Wed,January 9, 2019 12:08 AM

Unsecured assets worth Rs 6,000 crore

పార్లమెంట్‌కు తెలిపిన కేంద్ర మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా
న్యూఢిల్లీ, జనవరి 8: అప్రకటిత ఆస్తులపై కేంద్ర ప్రభుత్వం సందించిన అస్త్రం సత్ఫలితాలను ఇస్తున్నది. 2015లో నరేంద్ర మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన విదేశీ నల్లధనం చట్టంతో ఇప్పటి వరకు రూ.6 వేల కోట్లకు పైగా అప్రకటిత ఆస్తులను గుర్తించారు ప్రభుత్వ వర్గాలు. ఈ నూతన చట్టం కింద అక్టోబర్ 31, 2018 వరకు 34 మందికి వ్యతిరేకంగా ప్రాసిక్యూట్ చేయాలని కేసును నమోదు చేసినట్లు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా రాజ్యసభకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. ఈ చట్టం ప్రకారం స్వల్పకాలంపాటు విదేశాల్లో ఉ న్న తమ ఆస్తులను వెల్లడికి అవకాశం కల్పించింది. దీంతో సెప్టెంబర్ 30, 2015 నాటికి విదేశాల్లో ఉన్న రూ.4,100 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు 648 మంది ప్రకటించారు. వీరిపై పన్ను, జరిమానాల రూపంలో రూ.2,470 కోట్లు వసూలు చేసినట్లు ఆయన చెప్పారు. అప్రకటిత విదేశీ ఆస్తులు కలిగివున్నవారి పై ఐటీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుండటం వల్లనే ఇది సాధ్యమైంది. కాగా, ప్రభుత్వరంగ బ్యాంకులను కట్టడి చేసే ఉద్దేశంలోభాగంగా ఆర్బీఐకు మరిన్ని ఆధికారాలు ఇచ్చే ఆలోచనేది లేదని శుక్లా స్పష్టంచేశారు.

754
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles