హైదరాబాద్‌లో మరో రెండు పాయ్ స్టోర్లు

Wed,October 23, 2019 04:56 AM

హైదరాబాద్, అక్టోబర్ 22: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ పరికరాల విక్రయ సంస్థ పాయ్ ఇంటర్నేషనల్.. రాష్ట్రంలో వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే పలు రిటైల్ అవుట్‌లెట్లను ఏర్పాటు చేసిన సంస్థ.. తాజాగా హైదరాబాద్‌లో మరో రెండు మెగా స్టోర్లను ప్రారంభించింది. గచ్చిబౌలి, సన్‌సిటీల వద్ద ఏర్పాటు చేసిన ఈ స్టోర్లతో మొత్తం సంఖ్య 222కి చేరుకున్నది. ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ పాయ్ మాట్లాడుతూ.. 2000లో బెంగళూరులో తన తొలి స్టోర్‌ను ప్రారంభించిన సంస్థ.. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదని, క్రమంగా వ్యాపారాన్ని కర్ణాటకతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు విస్తరించినట్లు చెప్పారు. కాగా, ఈ షోరూం ప్రారంభం సందర్భంగా కొనుగోలుదారులకు 100 శాతం క్యాష్‌బ్యాక్, తక్కువ ధరకే అన్ని రకాల టెక్నాలజీ పరికరాలు, వారెంటీ పెంపు, చౌకగా రుణ సదుపాయం కల్పిస్తున్నది సంస్థ.

263
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles