ప్రీమియం సెగ్మెంట్‌లోకి టీవీఎస్

Thu,December 7, 2017 12:12 AM

TVS Apache RR 310 launched

tvs
చెన్నై, డిసెంబర్ 6: చెన్నైకు చెందిన ప్రముఖ ద్వి, త్రిచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్..తాజాగా సూపర్-ప్రీమియం బైకుల సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టింది. 310 సీసీ ఇంజిన్‌తో రూపొందించిన అపాచీ ఆర్‌ఆర్310ని దేశీయ మార్కెట్లోకి బుధవారం విడుదల చేసింది. 500 సీసీ కంటే తక్కువ సామర్థ్యం కలిగిన బైకులను రూపొందించడానికి 2013లో సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ సందర్భంగా టీవీఎస్ ప్రెసిడెంట్, సీఈవో కేఎన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ..ఇరు సంస్థలు కలిసి సాధారణ వేధికగా ఈ సరికొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేసినట్లు చెప్పారు. ఇందుకోసం ఇరు సంస్థలు రూ.400 కోట్ల మేర పెట్టుబడి పెట్టినట్లు ఆయన చెప్పారు. రూ.2.05 లక్షల ధర కలిగిన ఈ బైకు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలో ధరల్లో తేడాలు ఉండనున్నాయని ఆయన పేర్కొన్నారు.

239
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS