ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రత్యేక విధానం

Thu,July 11, 2019 03:13 AM

TS Govt is coming up with Export Promotion Policy

దేశీయ గ్రానైట్‌లో రాష్ట్ర వాటా 70 శాతం ఐటీ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ:దేశీయ ఎగుమతుల్లో రాష్ర్టాన్ని మూడోస్థానానికి చేరుకునేందుకు కృషిచేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఎగుమతుల అవకాశాలపై బుధవారం భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ప్రత్యేక సదస్సును నిర్వహించింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం రక్షణ రంగం ఎగుమతుల్లో దేశంలోనే మూడోస్థానంలో నిలిచిందని.. మొత్తం దేశీయ గ్రానైట్ ఎగుమతుల్లో మన రాష్ట్రం వాటా దాదాపు డ్బ్బై శాతం ఉంటుందని వెల్లడించారు. తెలంగాణ నుంచి ఎగుమతులను ప్రణాళికాబద్ధంగా ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారిస్తున్నదని.. ఇందుకోసం ఎగుమతుల అభివృద్ధి మండలి సూచనలు, పరిశ్రమల పెద్దల సహకారం, విదేశీ అత్యుత్తమ ప్రమాణాలను క్రోడీకరించి ప్రత్యేక విధానానాన్ని రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. ఇక్కడి సంస్థలు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించడం వల్ల రక్షణ, పునరుత్పాదక, ఖనిజ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయగలుగుతున్నామని చెప్పారు.

ఫార్మా సిటీ, మెడికల్ డివైజెస్ పార్క్, జినోమ్ వ్యాలీ వంటి వాటితో చిన్న తరహా పరిశ్రమలకు ఎగుమతుల్లో మెరుగైన అవకాశాలు ఉంటాయన్న ధీమా వ్యక్తంచేశారు. ఇప్పటికే మన రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యే వాటిలో పాలరాయి, ఆహారశుద్ధి ఉత్పత్తులకు చక్కటి ఆదరణ లభిస్తుందని చెప్పారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే హస్తకళలకు పూర్తిస్థాయిలో ప్రోత్సాహాన్ని అందజేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నట్టు తెలిపారు.

503
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles