ట్రయంఫ్ నుంచి నూతన బైకు

Mon,March 11, 2019 11:36 PM

Triumph Tiger 800 XCA Launched in India

-ధర రూ.15.17 లక్షలు

న్యూఢిల్లీ, మార్చి 11: బ్రిటన్‌కు చెందిన ప్రీమియం మోటర్‌సైకిళ్ల తయారీ సంస్థ ట్రయింఫ్..దేశీయ మార్కెట్లోకి మరో బైకును అందుబాటులోకి తీసుకొచ్చింది. లెటెస్ట్ వెర్షన్‌గా విడుదల చేసిన టైగర్ 800 ఎక్స్‌సీఏ ధరను రూ. 15.17 లక్షలుగా నిర్ణయించింది. పాతదాంతో పోలిస్తే ఈ నూతన మోడల్‌ను మరింత ఆధునీకరించినట్లు, ముఖ్యం గా ఇంజిన్‌ను అప్‌గ్రేడ్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. 800 సీసీ ఇంజిన్‌తో తయారైన ఈ బైకు 95పీఎస్ అవుట్‌పుట్ ఇవ్వనున్నదని, ఆరు రైడింగ్ మోడ్స్ వంటివి ఉన్నాయని ట్రయింఫ్ మోటర్‌సైకిల్ ఇండియా జనరల్ మేనేజర్ శోయబ్ ఫరూఖ్ తెలిపారు. టైగర్ బ్రాండ్‌కు భారత్‌లో మంచి డిమాండ్ ఉన్నదని, ఇప్పటికే వెయ్యికి పైగా వినియోగదారులు ఇక్కడ ఉన్నట్లు ఆయన చెప్పారు.

728
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles