ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం

Mon,June 10, 2019 02:31 AM

Trade tensions have intensified G20 finance chiefs

-వాణిజ్య యుద్ధాలపై జీ20 నేతల ఆందోళన
ఫుకువోక, జూన్ 9: వాణిజ్య యుద్ధాలపై జీ20 సభ్య దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికాకు చైనాసహా ఇతర దేశాలకు మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధాలు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెడుతున్నాయని పలువురు జీ20 నేతలు అభిప్రాయపడ్డారు. ఇక్కడ రెండు రోజులపాటు జరిగిన జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సదస్సు ఆదివారం ముగిసింది. అమెరికా-చైనా మధ్య మొదలైన వాణిజ్య యుద్ధం.. వచ్చే ఏడాది ప్రపంచ జీడీపీని 0.5 శాతం లేదా 455 బిలియన్ డాలర్ల మేర క్షీణింపజేసే వీలుందని ఈ సందర్భంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టిన్ లగార్డే అన్నారు.

అమెరికా-చైనా పరస్పర సుంకాలు ఆ రెండు దేశాల్నేగాక, ప్రపంచ ఆర్థిక వ్యవస్థని కుంగదీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరో సంక్షోభంలోకి గ్లోబల్ ఎకానమీ పడిపోక ముందే వాణిజ్య యుద్ధాలకు ముగింపు పలుకాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మెక్సికో-అమెరికా మధ్య కుదిరిన సయోధ్యను స్వాగతించిన జీ20 దేశాధినేతలు.. అమెరికా-చైనా మధ్య కూడా ఓ సహృద్భావ ఒప్పందం జరుగాలని ఆకాంక్షించారు. వలసలపై అమెరికా-మెక్సికోల మధ్య ఓ డీల్ కుదరగా, మెక్సికో వస్తూత్పత్తులపై 5 శాతం సుంకాల విధింపును ట్రంప్ సర్కారు ఉపసంహరించుకున్నది.

మరిన్ని సుంకాలే

అమెరికా ఆర్థిక మంత్రి స్టీవెన్ మ్నూచిన్ శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ఈ నెలాఖరులో ఒసాకాలో జరిగే జీ20 సదస్సులో తమ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య చర్చలు విఫలమైతే.. చైనాపై మరిన్ని సుంకాలు వేస్తామని స్పష్టం చేయడం గమనార్హం. ఒకవేళ ఈ లోగా చైనా చర్చలకు ముందుకొస్తే.. మేమూ చర్చిస్తామన్న ఆయన ఫలప్రదం కాకపోతే ప న్నుల భారం తప్పదని హెచ్చరించారు.

1534
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles