టయోటా వాహనాలు మరింత ప్రియం


Wed,September 13, 2017 12:49 AM

రూ.1.6 లక్షల వరకు పెంచిన సంస్థ
innova
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్(టీకేఎం) ఎంపిక చేసిన మోడళ్ల ధరలను రూ.13 వేల నుంచి రూ.1.6 లక్షల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. మధ్యస్థాయి, అతిపెద్ద, ఎస్‌యూవీ కార్లపై విధించే సెస్‌ను 2-7 శాతం వరకు పెంచుతున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ధరలు సవరించినట్లు టీకేఎం డైరెక్టర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ రాజా తెలిపారు. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇన్నోవా క్రిస్టా రూ.78 వేల వరకు పెరుగనుండగా, కోరోల్లా అల్తిస్ రూ.72 వేలు, ఎతియోస్ ప్లాటినమ్ రూ.13 వేలు, ఫార్చ్యునర్ రూ.1.6 లక్షల వరకు అధికమవనున్నాయి. కానీ హైబ్రిడ్, చిన్న కార్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదని ఆయన వెల్లడించారు. సెస్ పెంచేదానిపై మంగళవారం కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది.

405
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS