టొయోటాలో వీఆర్‌ఎస్ స్కీం!

Mon,October 7, 2019 12:12 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: దేశీయ ఆటో రంగంలో నెలకొన్న మం దగమనం, మార్కెట్‌లో పడిపోయిన వాహన విక్రయాల నేపథ్యంలో టొయో టా కిర్లోస్కర్ మోటర్ (టీకేఎం).. తమ ఉద్యోగులకు వీఆర్‌ఎస్ పథకాన్ని తీసుకొచ్చింది. కర్నాటకలోని బిదాడి ఉత్పాదక కేంద్రంలో దీన్ని అమలుపరుస్తున్నారు. గత నెల 22న మొదలైన ఈ నవ జీవన యోజన స్కీం.. ఈ నెల 23 వరకు నెల రోజులపాటు అందుబాటులో ఉంటుందని టీకేఎం వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఇది పూర్తిగా స్వచ్చంధమని, టీకేఎం మార్కెట్ పరిస్థితులకు, దీనికి ఎలాంటి సంబంధం లేదని సంస్థ వైస్ చైర్మన్ శేఖర్ విశ్వనాథన్ పీటీఐకి స్పష్టం చేశారు.


దేశవ్యాప్తంగా టీకేఎంకు దాదాపు 6,500 మంది ఉద్యోగులున్నారు. బిదాడిలో రెండు ప్లాంట్లున్నాయి. 3.10 లక్షల యూ నిట్ల వార్షిక ఉత్పాదక సా మర్థ్యం వీటి సొంతం. జపాన్‌కు చెందిన టొయోటా, భారత్‌కు చెందిన కిర్లోస్కర్ గ్రూప్ కలిసి టీకేఎంను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత నెల టొయో టా అమ్మకాలు 16.56 శాతం క్షీణించి 10,911 యూనిట్లకు పరిమితమయ్యాయి. కిందటి నెల హీరో మోటోకార్ప్ సైతం వీఆర్‌ఎస్‌ను అమల్లోకి తేవడం గమనార్హం.

347
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles