ఆ నిర్ణయాన్ని వాయిదా వేయండి

Sun,April 14, 2019 02:52 AM

Top Senators Urge Trump to Put Off Decision on India GSP

-భారత జీఎస్పీ సమీక్షపై ట్రంప్‌ను కోరిన సెనెటర్లు
వాషింగ్టన్, ఏప్రిల్ 13: భారత్‌కున్న వాణిజ్య ప్రాధాన్య హోదా (జీఎస్పీ-జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్)పై సమీక్ష నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఇద్దరు అమెరికన్ సెనెటర్లు.. ట్రంప్ సర్కారును కోరారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నందున.. అవి ముగిసేదాకా నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్‌టీఆర్) రాబర్ట్ లైథీజర్‌కు రాసిన ఓ లేఖలో రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనెటర్ జాన్ కార్నిన్, డెమొక్రటిక్ పార్టీకి చెందిన సెనెటర్ మార్క్ వార్నర్‌లు విజ్ఞప్తి చేశారు. ఆర్థికంగా వెనుకబడిన దేశాల అభివృద్ధి కోసం అగ్రరాజ్యమైన అమెరికా అనుసరిస్తున్న వాణిజ్య సహకార పథకమే జీఎస్పీనన్న విషయం తెలిసిందే. ఈ పథకంలో ఉన్న దేశాలు.. అమెరికాకు ఎలాంటి పన్నులు లేకుండానే తమ ఎగుమతుల్ని చేసుకోవచ్చు. అయితే ఈ పథకం నుంచి భారత్‌ను తొలగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెల నిర్ణయించారు. ఈ క్రమంలోనే సెనెటర్లు పైవిధంగా విజ్ఞప్తి చేశారు.

అమెరికాపై ఈయూ గరం

ఎయిర్‌బస్ రాయితీలపై అమెరికా ఏ రకంగా సుంకాలను విధించినా ఊరుకోబోమని, ప్రతీకార సుంకాలకు తాము సిద్ధమని ఐరోపా యూనియన్ (ఈయూ) హెచ్చరించింది. ఈ మేరకు గతంలో ట్రంప్ ఇచ్చిన సంకేతాలపట్ల ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి బ్రూనో లీ మెయిర్ స్పందించారు. ఫ్రాన్స్‌కు చెందిన విమానయాన సంస్థ ఎయిర్‌బస్, అమెరికాకు చెందిన బోయింగ్‌ల విషయంలో అమెరికా, ఈయూకు మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.

3348
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles