6078328 రోజుల్లో రూ.21 వేల కోట్లు మటాష్

Fri,July 12, 2019 03:15 AM

Titan Company investors lost over Rs 21,000 crore in last eight trading sessions

సంపదను కోల్పోయిన టైటాన్ కంపెనీ మదుపరులు

టాటా గ్రూపునకు చెందిన టైటాన్ కంపెనీ షేరు పాతళంలోకి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ మందకొడి వృద్ధిని నమోదు చేసుకోనున్నదన్న సంకేతాలు, పసిడి దిగుమతులపై సుం కాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కంపెనీని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. దీంతో గడిచిన ఎనిమిది ట్రేడింగ్‌లలో కంపెనీ షేరు ధర 17 శాతం పతనం చెందింది. జూలై 3న రూ.1,328గా నమోదైన షేరు ధర అమాంతం పడిపోయి రూ.1,100 కిందకు జారుకున్నది. ప్రముఖ పెట్టుబడిదారు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులు పెట్టిన టైటన్ కంపెనీ రేటింగ్‌ను తగ్గిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ప్రకటన ఎనలేని కష్టాలను తెచ్చిపెట్టింది. జూన్ 28 నుంచి ఇప్పటి వరకు కంపెనీ షేరు ధర 17 శాతం నష్టపోవడంతో రూ.21,232 కోట్ల మదుపరుల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. గత నెల చివర్లో రూ.1.18 లక్షల కోట్లుగా ఉన్న కంపెనీ విలువ ప్రస్తుతం రూ.97,274 కోట్లకు పడిపోయింది. గురువారం కంపెనీ షేరు ధర రూ.1,101 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 2.63 శాతం తగ్గి రూ.1,072.25 వద్దకు పడిపోయింది. గడిచిన ఏడాదికాలంగా 34.72 శాతం పెరిగిన షేరు ధర..గత వారంరోజుల్లో సగానికి సగం క్షీణించింది. స్టాక్ మార్కెట్లు 7.5 శాతం పెరిగినప్పటికీ కంపెనీ షేరు ధర భారీగా పతనమవడం విశేషం.

1095
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles