టై-హైదరాబాద్ మూడో ఎడిషన్‌గా టై గ్రాడ్

Wed,March 13, 2019 01:32 AM

TiE Hyderabad launches third edition of TiE Grad

హైదరాబాద్, మార్చి 12: విద్యార్థులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే ఉద్దేశంలో భాగంగా టై-హైదరాబాద్ మరోసారి టై గ్రాడ్‌ను ప్రకటించింది. మూడోసారి నిర్వహిస్తున్న ఈ ఉత్సవం ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉంటుందని, దీంట్లో పాల్గొనదలుచుకునే కళాశాలలు www. hyderabad.tie.org కి దరఖాస్తు చేసుకోవాలని టై హైదరాబాద్ ప్రెసిడెంట్ సురేష్ రెడ్డి సూచించారు. దీంట్లో గెలుపొందిన స్టార్టప్‌కు రూ.7 లక్షల నగదు బహుమతితోపాటు ప్రశంస పత్రాన్ని అందించనున్నది. ప్రస్తుతం ఇంజినీరింగ్, టెక్నాలజీ కళాశాలకు చెందిన విద్యార్థులు మాత్రమే పాల్గొంటుండగా, ఈసారి ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన కళాశాల విద్యార్థులకు కూడా వర్తించనున్నట్లు ఆయన చెప్పారు. గతేడాది నిర్వహించిన పోటీల్లో 16 కాలేజీలకు చెందిన 2,600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మూడోసారి నిర్వహించనున్న ఈ పోటీల్లో 25 కళాశాలల నుంచి 5 వేల మంది విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం టై హైదరాబాద్‌లో 600 మంది సభ్యులు ఉండగా, ఈ ఏడాది చివరి నాటికి వెయ్యికి పెంచాలనుకుంటున్నట్లు చెప్పారు.

301
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles