అమెరికా మహిళ సంపన్నుల్లో ముగ్గురు భారతీయ వనితలు

Sat,June 8, 2019 12:45 AM

Three Indian origin women among Forbes list of Americas richest self made womens

న్యూయార్క్, జూన్ 7: అమెరికా సంపన్న వర్గాల్లోనూ భారతీయ మహిళలు సత్తచాటుతున్నారు. ప్రస్తుత సంవత్సరానికిగాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన అమెరికా-80 మహిళా సంపన్న వర్గాల జాబితాలో ముగ్గురు దేశీయ మహిళలకు చోటు లభించింది. వీరిలో కంప్యూటర్ నెట్‌వర్కింగ్ సంస్థయైన అరిస్టా నెట్‌వర్క్స్ ప్రెసిడెంట్, సీఈవో జయశ్రీ ఉల్లల్, ఐటీ కన్సెల్టింగ్ అండ్ అవుట్‌సోర్సింగ్ సంస్థ సింటెల్ కో-ఫౌండర్ నీర్జా సేథి, స్ట్రీమింగ్ డాటా టెక్నాలజీ కంపెనీ కన్లూయెంట్ సీటీవో, కో-ఫౌండర్ నేహా నర్కేదా ఉన్నారు. అమెరికాలో రూఫింగ్, సైడింగ్, విండోస్‌లో హోల్‌సేల్ డిస్ట్రిబ్యూషన్ అగ్రగామిగా ఉన్న ఏబీసీ చైర్మన్ డయాన్ హెండ్రిక్స్‌కు ఈ జాబితాలో తొలి స్థానం లభించింది. 72 ఏండ్ల వయస్సు కలిగిన డయాన్ ఆస్తి విలువ 700 కోట్ల డాలర్లు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ మహిళల్లో ఉల్లల్‌కు 18వ స్థానం లభించింది. ఆమె ఆస్తి 1.4 బిలియన్ డాలర్లు. భారత సంతతికి చెందిన ఉల్లల్ లండన్‌లో జన్మించి అమెరికా వ్యాపార సామ్రాజ్యంలో తనదైన ముద్రవేస్తున్నారని ఫోర్బ్స్ పేర్కొంది. అలాగే, బిలియన్ డాలర్ల నికర ఆస్తితో సేథికి 23వ స్థానం లభించింది. 1980లో కేవలం 2 వేల డాలర్లతో ఆమె భర్త భరత్ దేశాయ్‌తో కలిసి రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె.. ప్రస్తుతం బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది.

360 మిలియన్ డాలర్ల ఆస్తితో నేహాకు 60వ స్థానం దక్కింది. మరోవైపు, 2019 ఏడాదికిగాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన మహిళ జాబితాలో మీడియా మోగుల్ ఒప్హ్రా విన్‌ఫ్రెకు 10వ స్థానం దక్కగా, ఫేస్‌బుక్ చీఫ్ ఆపరేటింగ్ అధికారికి 12వ స్థానం, రియల్టీ టీవీ స్టార్ కైలీ జెన్నర్‌కు 23వ స్థానం, ఫ్యాషన్ డిజైనర్ టోరీ బుర్చ్‌కు 29వ స్థానం, పాప్ స్టార్ రిహాన్నకు 37వ స్థానం, మడోన్నాకు 39వ ప్లేస్‌లో నిలిచారు. 21 ఏండ్ల నుంచి 92 ఏండ్లలోపు వయస్సు కలిగిన ఈ 80 మంది మహిళ సంపన్నవర్గాల ఆస్తి 81.3 బిలియన్ డాలర్లు. కనీసంగా 225 మిలియన్ డాలర్ల కంటే అధికంగా ఆస్తి కలిగివున్న వారికి మాత్రం ఈ జాబితాలో చోటు కల్పించింది.

2426
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles