మూడు కంపెనీల అడ్రస్ గోల్‌మాల్


Sun,February 18, 2018 12:53 AM

నీరవ్ మోదీకి చెందిన మూడు డైమండ్ కంపెనీల అడ్రస్‌లోనూ గోల్‌మాల్ జరిగినట్లు పీఎన్‌బీ అధికారులు గుర్తించారు. రుణం తీసుకున్నప్పుడు ఇచ్చిన అడ్రస్, ప్రస్తుతం ఉన్న అడ్రస్‌కు పొంతన లేదని సీబీఐ విచారణలో వెల్లడైంది. కంపెనీల చిరునామా మారినప్పటికీ ఈ విషయాన్ని పీఎన్‌బీకి సమాచారం ఇవ్వలేదు. బ్యాంకు వద్ద ఉన్న అడ్రస్ ప్రకారం సీబీఐ అధికారులు వెళ్లితే అక్కడ వేరే కార్యాలయం ప్రత్యక్షమైంది. ముంబైలోని ఒపెరా హౌజ్‌లో ఉన్న సోలార్ ఎక్స్‌పోర్ట్స్ అండ్ స్టెల్లర్ డైమండ్స్ కార్యాలయం లోయర్ ప్యారెల్‌కు గతంలోనే మార్చారట. అలాగే డైమండ్ ఆర్ యూఎస్ ఆఫీస్ కూడా ప్రసాద్ చాంబర్స్ వద్ద ఉండగా, దీనిని కూడా వేరేచోటికి మార్చివేశారు.

474

More News

VIRAL NEWS