సహారా సంకల్ప్ వర్ష్


Fri,October 13, 2017 01:06 AM

sahara
హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న సహారా ఇండియా పరివార్ 40వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నది. దీన్ని సహారా సంకల్ప్ వర్ష్‌గా నిర్వహించబోతున్నది. సంస్థ 40వ వార్షికోత్సవం గురించి తెలుపుతూ గురువారం సహారా ఇండియా పరివార్ ఓ ప్రకటన జారీ చేసింది. 1978వ సంవత్సరంలో కేవలం ముగ్గురు వర్కర్లు, రూ.2 వేలతో సహారా గ్రూపు ప్రస్థానం ప్రారంభమైంది అని తెలిపింది. సంస్థలోని సభ్యులంతా ఒకే కుటుంబమనే వినూత్న సిద్ధాంతంతో సమిష్ఠి వృద్ధి, నిరంతర వృద్ధి అనే వాగ్దానంతో సంస్థను ప్రారంభించడం జరిగిందని సహారా గ్రూపు చైర్మన్ సుబ్రతారాయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం సంస్థకు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది సిబ్బంది, 10 కోట్ల మంది కస్టమర్లున్నారని, గ్రూపు మార్కెట్ విలువ రూ.2 లక్షల కోట్లకు చేరుకుందని తెలిపింది. అంకితభావం, క్రమశిక్షణ, బలీయమైన సూత్రాలు, జాతి అభివృద్ధి అనే ప్రతిజ్ఞతో రాసిన అపూర్వమైన విజయగాధ ఇదని సహారా పేర్కొంది.

334

More News

VIRAL NEWS