జీఎస్టీలో 26శాతం వృద్ధిరేటు

Fri,January 11, 2019 11:54 PM

The GST is 26 Percentage growth rate

- డిసెంబర్ నెలలో రూ.3,874 కోట్ల రాబడి
ప్రత్యేకప్రతినిధి,నమస్తేతెలంగాణ : రాష్ట్రంలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్) వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రాబడి నెలనెలా పెరుగుతున్నది. డిసెంబర్ నెలలో కూడా రాబడి 25.99 శాతం పెరిగింది. దేశ వ్యాప్తంగా జీఎస్టీ రాబడిలో వృద్ది రేటు తగ్గుతుంటే రాష్ట్రంలో మాత్రం పెరుగుతున్నది. డిసెంబర్ నెలలో వ్యాట్, జీఎస్టీ వసూళ్ల ద్వారా 3,873.88 కోట్ల రూపాయల రాబడి సమకూరింది. గత ఏడాది డిసెంబర్ నెలలో 3074 కోట్ల రూపాయల రాబడి వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఈ నెల దాదాపు రూ. 800 కోట్లు అధిక ఆదాయం వచ్చిం ది. గతంతో పోలిస్తే రాబడిలో 25.99 శాతం వృద్ధి రేటు నమోదైందని ఆబ్కారీ, వాణిజ్యపన్నుల శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్ వెల్లడించారు. సగటు వృద్ధిరేటు 21 శాతాన్ని మించి రాబడి పెరుగుతుండటం విశేషం.
we-hub

300
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles