హెచ్‌పీ ప్రింటర్లు మరింత ప్రియం

Mon,July 17, 2017 03:32 AM

The best printers you can buy for less than $100

ఎంఎఫ్ ప్రింటర్లు, క్యార్ట్రిడ్జ్‌ల రేట్లను 15 శాతం మేర పెంచిన సంస్థ
HPprinter
న్యూఢిల్లీ, జూలై 16: టెక్నాలజీ రంగంలో అంతర్జాతీయ దిగ్గజం హెచ్‌పీ.. మల్టీ ఫంక్షనల్ ప్రింటర్లు (ఎంఎఫ్‌పీ), క్యార్ట్రిడ్జ్‌ల ధరలను గరిష్ఠంగా 15శాతం పెంచింది. జీఎస్టీ హయాంలో ఈ రకం ఉత్పత్తులపై పన్ను భారం పెరుగడమే ఇందుకు కారణం. అయితే, సింగిల్ ఫంక్షన్ ప్రింటర్లు, నోట్‌బుక్‌లు, డెస్క్‌టాప్ కంప్యూటర్ల ధరలను మాత్రం యథాతథంగా కొనసాగించనున్నట్లు హెచ్‌పీ తెలిపింది. ఎంఎఫ్‌పీలపై 8-10 శాతం, ఇంక్ క్యార్ట్రిడ్జ్ లపై12-15 శాతం మేర పెంచినట్లు సంస్థ వెల్లడించింది. గతంలో ఎంఎఫ్‌పీలపై పన్నురేటు 18 శాతం స్థాయిలో ఉండగా.. జీఎస్టీ హయాంలో 28 శాతానికి పెరిగింది. అలాగే, ఇంక్ క్యార్ట్రిడ్జ్‌లపై గతంలో పన్ను రేటు 15-18 శాతంగా ఉండగా.. ఇప్పుడది 28 శాతానికి చేరుకుంది. జీఎస్టీ చట్టంలోనూ నోట్‌బుక్‌లపై పన్నురేటును 18 శాతంగానే ఉంచారు.

206

More News

VIRAL NEWS