బ్యాంకింగ్ సమ్మె పాక్షికం

Wed,October 23, 2019 05:03 AM

- పాల్గొన్న 4 లక్షల మంది ఉద్యోగులు
న్యూఢిల్లీ, అక్టోబర్ 22: బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు చేపట్టిన ఒకరోజు సమ్మెతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు పాక్షికంగా నిలిచిపోయాయి. బ్యాంకింగ్ విలీనాలను, పొదుపు వడ్డీరేట్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు మంగళవారం ఒకరోజు సమ్మె చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సమ్మెలో 4 లక్షల మంది ఉద్యోగులు పాల్గొనడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలు... ముఖ్యంగా నగ దు డిపాజిట్లు, ఉపసంహరణలతోపాటు చెక్ క్లియరెన్స్‌లపై ప్రభావం చూపాయి. కానీ, ప్రైవేట్ రంగ బ్యాంకులు పూర్తిస్థాయిలో పనిచేశాయి. ఉద్యోగులు సమ్మె బాటపట్టడంతో దేశవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో ఉన్న ప్రభుత్వరంగ శాఖలు మూతపడ్డాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్‌ఐ) చేపట్టిన సమ్మెపై ఇప్పటికే బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ, ఇతర బ్యాంకులు తమ ఖాతాదారులకు సమాచారాన్ని చేరవేశాయి కూడా. మహారాష్ట్రలో 40 వేల సిబ్బంది పాల్గొనడంతో 10 వేల శాఖలు స్థంభించిపోయాయి. తెలంగాణలోనూ బ్యాంకింగ్ ఆర్థిక లావాదేవీలపై సమ్మె ప్రభావం అంతంత మాత్రంగానే కనిపించింది. నగదు డిపాజిట్లు, ఉపసంహరణ, చెక్ క్లియరెన్స్‌లు కాలేవని ఏఐబీఈఏ జాతీయ కార్యదర్శి బీఎస్ రాంబాబు తెలిపారు. ఈ సమ్మెలో ఎస్బీఐ ఉద్యోగులు పాల్గొనలేదని, ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగులు ఆందోళన చేయడంతో పూర్తిగా ఈ బ్యాంక్‌కు సంబంధించిన అన్ని రకాల సేవలు నిలిచిపోయాయన్నారు.


మూతపడనున్న మరో 2 వేల శాఖలు
పది ప్రభుత్వరంగ బ్యాంకులను నాలిగింటిలో విలీనం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా మరో 2 వేల శాఖల వరకు మూతపడనున్నాయని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. ఇప్పటికే అనుబంధ బ్యాంకులు ఎస్బీఐలో, దేనా, విజయ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనంకావడంతో దాదాపు 3 వేల శాఖల వరకు మూతపడ్డాయన్నారు. ఆగస్టులో పీఎన్‌బీలో ఓబీసీ, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, సిండికేట్ బ్యాంక్‌లో కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆం ధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌లో అలహాబాద్ బ్యాంకులను విలీనం చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

381
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles