ఇమామీలో 10 శాతం ప్రమోటర్ల వాటా విక్రయం

Tue,February 19, 2019 12:02 AM

కోల్‌కతా, ఫిబ్రవరి 18: ఇమామీ గ్రూప్‌లోని ప్రతిష్ఠాత్మక సంస్థ ఇమామీ లిమిటెడ్‌లో 10 శాతం వాటాను ప్రమోటర్లు అమ్మేశారు. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్, ప్రేమ్‌జీఇన్వెస్ట్, అముండి, ఐడీఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ మ్యూచువల్ ఫండ్ తదితర సంస్థలు ఈ వాటాలను కొనుగోలు చేశాయి. ఈ అమ్మకంతో దాదా పు రూ.1,600 కోట్ల నిధులు ఇమామీ చేతికి వస్తుండగా, ఈ మొత్తాన్ని ప్రమోటర్ల రుణభారాన్ని తగ్గించుకోవడానికి వినియోగిస్తామని సోమవారం ఓ ప్రకటనలో సంస్థ తెలియజేసింది. స్టాక్ మార్కెట్లలో లేని ఇమామీ గ్రూప్ సంస్థల్లో ప్రమోటర్ల రుణాల విలువ సుమారు రూ.4,000 కోట్లుందని కంపెనీ డైరెక్టర్ మోహన్ గోయెంకా తెలిపారు.

410
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles