టెలికం వినియోగదారులు @ 120 కోట్లు

Thu,March 21, 2019 01:02 AM

Telecom subscriber base crosses 120 crore mark

న్యూఢిల్లీ, మార్చి 20: భారత్‌లో టెలికం వినియోగదారులు వాయువేగంతో దూ సుకుపోతున్నారు. జనవరి నెల చివరినాటికి దేశవ్యాప్తంగా టెలికం సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 120 కోట్లు దాటిందని టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది. డిసెంబర్ చివరి నాటికి 119.78 కోట్లుగా ఉన్న వినియోగదారులు ఆ మరుసటి నెలకుగాను 120. 37 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. గతంలో రెండుసార్లు జూలై 2017, మే 2018 లోనే ఈ రికార్డు స్థాయి మార్క్ ను దాటిన విషయం తెలిసిందే. వీరిలో మొబైల్ కస్టమర్లు 117 కోట్ల నుంచి 118 కోట్లకు పెరుగగా, వైర్‌లైన్ కనెక్షన్లు 2.18 కోట్ల నుంచి 2.17 కోట్లకు తగ్గినట్లు తెలిపింది. మొబైల్ వినియోగదారులను ఆకట్టుకోవడంలో రిలయన్స్ జియో ముందువరుసలో నిలిచింది. జనవరిలో సంస్థ నూతనంగా 93 లక్షల మందిని ఆకట్టుకోగా, ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ 9.82 లక్షల మందిని, భారతీ ఎయిర్‌టెల్‌ను లక్ష మంది సబ్‌స్ర్కైబర్లు ఎంచుకున్నారు. కానీ, వొడాఫోన్-ఐడియా, టాటా టెలిసర్వీసెస్‌లు సంయుక్తంగా 44 లక్షల మంది మొబైల్ వినియోగదారులను కోల్పోయా యి. వీరిలో వొడాఫోన్-ఐడియాకు చెందిన 35.8 లక్షల వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లను ఎంచుకోగా, టాటా టెలిసర్వీసెస్ 8.4 లక్షల మంది సబ్‌స్ర్కైబర్లను కోల్పోయింది.

501
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles