బ్లాక్‌చైన్ సంస్థలకు ప్రోత్సాహం

Mon,May 27, 2019 12:31 AM

Telangana woos blockchain firms startups offers incentives

- రాయితీ ధరలకు భూములు, పరిశోధనలకు నిధులు
- ఆకట్టుకుంటున్న తెలంగాణ బ్లాక్‌చైన్ ముసాయిదా విధానం


హైదరాబాద్, మే 26: నూతన ఆవిష్కరణలకు, ఔత్సాహిక వ్యాపార, పారిశ్రామికవేత్తలకు ఆది నుంచి అగ్ర తాంబూలం ఇస్తున్న రాష్ట్ర ప్రభు త్వం.. మరోసారి బ్లాక్‌చైన్ ముసాయిదా విధానంతో పెద్దపీట వేసింది. రాయితీపై తక్కువ ధరలకే భూములు, పరిశోధనలకు నిధులను అందించడం, కట్టుదిట్టమైన నియంత్రణ, విధానపరమైన సహాయ సహకారాలు ఇవ్వ డం వంటివి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నూతన డ్రాఫ్ట్ బ్లాక్‌చైన్ పాలసీ ము ఖ్యాంశాలు. బ్లాక్‌చైన్ ఆధారిత సంస్థలు, స్టార్టప్‌లను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పాలసీని ప్రభుత్వం రూపొందించింది. ఈ నెల 17న విడుదలైన ఈ డ్రాఫ్ట్ పాలసీ.. రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో బ్లాక్‌చైన్ సంస్థల ఏర్పాటుకు ఔత్సాహికులను ఆకట్టుకునేలా తగిన ప్రోత్సాహకాలతో ముందుకొచ్చింది.

బ్లాక్‌చైన్‌దే భవిష్యత్తు

భవిష్యత్తు అంతా బ్లాక్‌చైన్‌దేనని తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. దానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే మొదటి మూడేండ్లపాటు సంస్థ కార్యకలాపాల నిమిత్తం ఏటా రూ.5 లక్షల వరకు లీజ్ రెంటల్స్ 25 శాతం రాయితీని ప్రభుత్వం ప్రతిపాదించింది. స్టార్టప్‌ల కోసం రాష్ట్ర జీఎస్టీలో 100 శాతం రీయింబర్స్‌మెంట్, 10 శాతం వరకు ఆర్‌అండ్‌డీ గ్రాంట్, మూడేండ్లు ఏటా పది బ్లాక్‌చైన్ స్టార్టప్‌లకు ఏకకాల గ్రాంట్‌గా రూ. 10 లక్షలను ఇవ్వనున్నది. అలాగే అన్ని బ్లాక్‌చైన్ స్టార్టప్‌లకు ఆఫీస్ స్పేస్‌ను కల్పించనున్నది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ సంస్థల సహకారంతో బ్లాక్‌చైన్ డిస్ట్రిక్ట్‌ను ఏర్పాటు చేస్తున్నది. దేశంలోనే ఇది తొలి బ్లాక్‌చైన్ డిస్ట్రిక్ట్ అవనుండగా, హైదరాబాద్ పరిధిలో ఇది కొలువుదీరేలా ముందుకెళ్తున్నది సర్కారు. గతేడాదే దీని ప్రారంభానికి టెక్ మహీంద్రాతో తెలంగాణ సర్కారు ఒప్పందం కూడా చేసుకున్న విషయం తెలిసిందే. అన్ని ప్రధాన బ్లాక్‌చైన్ టెక్నాలజీ సంస్థల భాగస్వామ్యంతో ఇదో పెద్ద ఇంక్యుబేటర్‌గానేగాక పరిశోధనలు, నూతన ఆవిష్కరణల కోసం ప్రపంచ శ్రేణి సౌకర్యాలను కలిగి ఉండనున్నది. బ్లాక్‌చైన్ టెక్నాలజీలో పరిశోధనలకూ రాష్ట్ర ప్రభుత్వం నిధులను అందివ్వనుండగా, ఎంపిక చేసిన పలు ప్రధాన ఇనిస్టిట్యూట్లలో ఈ పరిశోధనలను నిర్వహించనున్నది. 2025 నాటికి బ్లాక్‌చైన్ టెక్నాలజీ.. గ్లోబల్ జీడీపీలో 10 శాతాన్ని ఆక్రమిస్తుందన్నది అంచనా. 2030 నాటికి ఏటా 3 లక్షల కోట్ల డాలర్ల వ్యాపారాన్ని సృష్టిస్తుందన్నది నిపుణుల మాటగా ఉండటం గమనార్హం.

సరళతర వ్యవస్థ

దేశంలోనే తెలంగాణను బ్లాక్‌చైన్ రాజధానిగా నిలబెట్టేందుకు వచ్చిన ఈ పాలసీలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీఎల్) బ్లాక్‌చైన్ సంస్థలకు రాయితీపై భూ కేటాయింపులను జరుపనున్నది. ఇక మార్గదర్శకాలనూ సరళతరం చేశారు. వార్షిక ఆదాయం, పెట్టుబడుల హామీలు, ఉద్యోగావకాశాలు వంటి వాటిల్లో రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) సంస్థలకు సూచించిన నిబంధనలను బ్లాక్‌చైన్ సంస్థల కోసం తాజా పాలసీలో సవరించారు. బ్లాక్‌చైన్ అనేది ఓ కట్టుదిట్టమైన వ్యవస్థ అన్న విషయం తెలిసిందే. కీలకమైన సమాచారాన్ని భద్రపరుచడం, ఆ డేటాను నిల్వ చేసి పంపిణీ మాత్రమే అ య్యేలా, మార్పులు లేకుండా కాపీ చేసుకునేందుకు అవకాశాన్నిస్తుంది. టాంపరింగ్‌కు వీల్లేకుండా సాయపడుతుంది.

837
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles