రెరా గడువు 31 వరకు పొడిగింపు

Fri,March 15, 2019 12:20 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ (రెరా) దరఖాస్తుల గడువును ఈ నెల 15 నుంచి 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు రెరా చైర్మన్, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌తివారి తెలిపారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రెరా చట్టం ఏర్పడిన నాటి నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో చేపట్టిన ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులు, కొత్తగా చేపట్టే ప్రాజెక్టులను రెరాలో దరఖాస్తు చేసుకోవాలని అథారిటీ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టులను నమోదు చేసుకోవడానికి మొదట మార్చి 15వరకు గడువు విధించింది. అయితే ఈ గడువు ముగుస్తున్న నేపథ్యంలో వచ్చిన విజ్ఞప్తుల మేరకు గురువారం సమావేశమైన అధికారులు ఈ గడువును ఈ నెల చివరివరకు పొడిగించాలని నిర్ణయించింది.

545
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles