ఇన్నోవేషన్ హబ్‌గా తెలంగాణ

Sun,October 13, 2019 02:32 AM

-ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం ఇన్నోవేషన్‌కు హబ్‌గా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఐఎస్‌బీలో బ్లాక్ చైన్ డిస్ట్రిక్ట్ లోగో, వెబ్‌సైట్‌లను నీతి అయోగ్ సలహాదారు అన్న రాయ్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రభావం ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉన్నా.. రాబోయే రోజుల్లో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. దీని అభివృద్ధికి కావాల్సిన ప్రోత్సాహాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని వివరించారు.

266
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles