టెక్ మహీంద్రా బైబ్యాక్!

Sun,February 17, 2019 12:53 AM

Tech Mahindra board to meet on Feb 21 to consider share buyback

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: దేశంలో ఐదో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా తన షేర్లను తిరిగి కొనుగోలు(బైబ్యాక్) చేసే ప్రతిపాదనలో ఉన్నది. ఈ నెల 21న జరుగనున్న బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నది. ఈ ప్రతిపాదనకు సంబంధించి మరింత సమాచారం ఇవ్వడానికి కంపెనీ వర్గాలు నిరాకరించాయి. షెడ్యూల్ ప్రకారం వచ్చే గురువారం బోర్డు ఆఫ్ డైరెక్టర్లు సమావేశం కాబోతున్నారు..ఈ భేటీ బైబ్యాక్ ప్రతిపాదనతోపాటు ఇతర విషయాలపై చర్చించే అవకాశం ఉన్నది అని కంపెనీ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. ప్రస్తుతం సంస్థ వద్ద మిగులు నిధులు అధికంగా ఉండటంతో వాటాదారులకు డివిడెండ్ కానీ, బైబ్యాక్ రూపంలో చెల్లించాలనుకుంటున్నది. అంతకుముందు ఇన్ఫోసిస్ రూ. 8,200 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.

1283
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles