ఇంటెల్ చేతికి హైదరాబాద్ స్టార్టప్

Tue,February 19, 2019 12:59 AM

సహారా ఇండియా పరివార్ అధినేత సుబ్రతా రాయ్‌ని కలుసుకునేందుకు ఘనా దేశ ఉన్నతస్థాయి బృందం భారత్‌కు విచ్చేసింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా లక్నోలోని సహారా షెహర్‌కు వీరంతా చేరుకుని, అక్కడ రాయ్‌ని కలుసుకున్నారు. వీరిలో ఘనా రాయల్ ప్రిన్స్ ఒహెనెబా ఆట్చెర్, భారత్‌కు ఆ దేశ హైకమిషనర్ మైఖెలారెన్, బ్రిటన్ లార్డ్స్ హౌజ్ సభ్యుడు కమలేశ్ కుమార్ పటేల్ తదితరులున్నారు. ఈ సందర్భంగా రాయ్‌కి ఆట్చెర్ ప్రత్యేక పతకాన్ని బహూకరించారు.


హైదరాబాద్, ఫిబ్రవరి 18: అమెరికాకు చెందిన ప్రముఖ చిప్‌ల తయారీ సంస్థ ఇంటెల్ కార్పొరేషన్..హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ ఇనేదా సిస్టమ్స్‌ను కొనుగోలు చేసింది. ఆర్థిక వివరాలు మాత్రం ఇరు సంస్థలు వెల్లడించలేదు. ఫాపింగ్‌లో నూతన అనుభవం కల్పించడానికి టెక్నాలజీ పరంగా సేవలు అందిస్తున్నది ఈ స్టార్టప్. పూర్తిగా నగదు రూపంలో జరిగిన ఈ కొనుగోలు ఒప్పందం గతవారంలో జరిగినట్లు తెలుస్తున్నది. టెక్నాలజీ విభాగంలో అత్యధికంగా నైపుణ్యం కలిగిన వారిని లక్ష్యంగా చేసుకొని వారు రూపొందించిన నూతన ఆవిష్కరణలపై ఇంటెల్ దృష్టి సారించింది. దీంట్లోభాగంగా ఇంటెల్ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 100 మంది ఇంజినీర్లను చేజిక్కించుకున్నది. ప్రముఖ టెక్నాలజీ నిపుణుడు దశరత గుడే ఈ ఇనేదా సిస్టమ్స్ స్టార్టప్‌ను 2010-11లో ఆవిష్కరించారు. మూడేండ్ల క్రితం ఈ స్టార్టప్‌లోకి 60 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాయి పలు అంతర్జాతీయ సంస్థలు. వీటిలో సామ్‌సంగ్, క్వాల్‌కామ్ వెంచర్స్, వాల్డెన్-రివర్‌వూడ్ వెంచర్స్, ఇమాజీనేషన్ టెక్నాలజీలతోపాటు ఇతర సంస్థలు కూడా ఉన్నాయి.

851
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles