ఎలక్ట్రిక్ వాహనాలపై తగ్గనున్న పన్ను!

Mon,July 22, 2019 03:08 AM

Tax deducted on Electric Vehicles

-25న జీఎస్టీ కౌన్సిల్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం
న్యూఢిల్లీ, జూలై 21: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ నెల 25న జరుగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో విద్యుత్‌తో నడిచే వాహనాలపై పన్ను తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత జరుగుతున్న 36వ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ సమావేశంలో సౌర విద్యుత్ జనరేటింగ్ పరికరాలు, పవన విద్యుత్ టర్బైన్ ప్రాజెక్టులపై విధించే జీఎస్టీని ఎత్తివేసేదానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. గత జీఎస్టీ సమావేశంలో ఈవీ, ఎలక్ట్రిక్ చార్జర్లు, అద్దెకు తీసుకునే ఈవీలపై జీఎస్టీ పన్ను విధించేదానిపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దేశీయంగా ఈవీల తయారీని ప్రోత్సహించడానికి ఈ వాహనాలపై విధించే జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని కౌన్సిల్‌కు కేంద్ర ప్రభుత్వం గతంలో సూచించింది. కానీ, దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే పెట్రోల్, డీజిల్ కార్లు, హైబ్రిడ్ వాహనాలపై మాత్రం 28 శాతం జీఎస్టీతోపాటు అదనంగా సెస్‌ను విధిస్తున్నది.

400
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles