జైసల్మేర్(రాజస్థాన్), డిసెంబర్ 4: వాహన ధరలు పెంచడానికి టాటా మోటర్స్ కూడా సిద్ధమైంది. వచ్చే నెల నుంచి అన్ని రకాల ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచబోతున్నట్లు కంపెనీ వర్గాలు బుధవారం ప్రకటించాయి. బీఎస్-6 ప్రమాణాలకు లోబడి వాహనాలను తయారు చేయడానికి అయ్యే ఉత్పత్తి వ్యయం అధికమవుతున్నదని, సంస్థపై పడుతున్న ఈ అదనపు భారాన్ని వినియోగదారులకు మళ్లించడంలో భాగంగా వాహన ధరలను పెంచకతప్పడం లేదని టాటా మోటర్స్ ప్రెసిడెంట్ మయాంక్ పరేఖ్ తెలిపారు. ధరలను ఎంతపెంచుతున్నదో తెలుపడానికి ఆయన నిరాకరించారు.