టాటా స్టీల్ లాభంలో భారీ వృద్ధి

Sat,February 9, 2019 12:24 AM

Tata Steel gains huge growth

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.1,753.07 కోట్ల సమీకృత నికర లాభాన్ని ఆర్జించినట్లు ప్రముఖ స్టీల్ తయారీ సంస్థ టాటా స్టీల్ ప్రకటించింది. 2017-18 ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.1,135.92 కోట్లతో పోలిస్తే 54.33 శాతం ఎగబాకింది. గడిచిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.41, 431.37 కోట్లకు చేరుకోవడం వల్లనే లాభా ల్లో భారీ వృద్ధి నమోదైందని కంపెనీ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ తెలిపారు. నిర్వహణ ఖర్చులు రూ.30,552.03 కోట్ల నుంచి రూ.38,362.03 కోట్లకు పెరిగాయి. కొనుగోలుదారులతో సఖ్యతగావుండటం, పనితీరును మెరుగుపరుచుకోవడం, నిలకడైన వృద్ధిని సాధించడం వల్లనే ఫలితాల్లో భారీ వృద్ధి నమోదైనట్లు ఆయన చెప్పారు.

అంతర్జాతీయ మార్కెట్లో స్టీల్ ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ నిలకడైన వృద్ధిని సాధించినట్లు, ముఖ్యం గా అమ్మకాలు ఆశించిన స్థాయిలో పెరిగాయన్నారు. ఇటీవల కొనుగోలు చేసిన బీఎస్‌ఎల్ స్టీల్ ప్లాంట్ సామర్థ్యానికి మించి ఉత్పత్తి చేస్తున్నదన్నారు. బీఎస్‌ఎల్‌ను కొనుగోలు చేయడానికి రూ.15 వేల కోట్ల రుణం తీసుకున్నట్లు, వీటిని దీర్ఘకాలికంగా చెల్లించడానికి బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ సీఈవో పేర్కొన్నారు. ప్రస్తుతం సంస్థ వద్ద రూ.4,150 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. ఏకీకృత విషయానికి వస్తే రూ.17,759.85 కోట్ల ఆదాయం(10 శాతం వృద్ధి)పై రూ.2,456.09 కోట్ల నికర లాభాన్ని(83.5 శాతం వృద్ధి) నమోదు చేసుకున్నది. కంపెనీ షేరు ధర 3.70 శాతం క్షీణించి రూ.469.55 వద్ద ముగిసింది.

753
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles