భారతీయులకు స్విస్ నోటీసులు

Mon,May 27, 2019 12:15 AM

Switzerland steps up process to share banking info 11 Indians get notices in a day

- ఒక్కరోజే 11 మందికి జారీ

న్యూఢిల్లీ/బెర్న్, మే 26: తమ దేశ బ్యాంకుల్లో ఖాతాలున్న భారతీయుల సమాచారాన్ని భారత్‌తో పంచుకుంటున్న స్విట్జర్లాండ్ ప్రభుత్వం.. ఆ సమాచారం రహస్యంగానే ఉండాలంటే దాన్ని సమర్థించే వివరాలతో అర్జీ పెట్టుకోవాలని ఖాతాదారులకు నోటీసులను పంపుతున్నది. మార్చి నుంచి కనీసం 25 మందికి ఇలాంటి నోటీసులను పంపిన స్విస్ సర్కారు.. ఇటీవలికాలంలో వీటి పంపిణీని పెంచేసింది. ఈ క్రమంలోనే ఒక్కరోజే 11 మందికి ఇవ్వడం గమనార్హం. సదరు నోటీసుల్లో వీరి పేర్లను సూక్ష్మ రూపంలో పేర్కొంటూ వివరాలను కోరుతున్నది. పుట్టిన తేదీలనూ పెడుతుండగా, ఇద్దరికి మాత్రం పేర్లతో నోటీసులనిచ్చింది. 1949 మేలో జన్మించిన కృష్ణ భగవాన్ రాంచంద్, 1972 సెప్టెంబర్‌లో పుట్టిన కల్పేశ్ హర్షద్ కినారివాలాకు ఇలా నోటీసులు అందాయి. కాగా, 30 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, లేనిపక్షంలో ఖాతాల వివరాలు భారత ప్రభుత్వానికి ఇచ్చేస్తామని స్విస్ ప్రభుత్వం ఆ నోటీసుల్లో హెచ్చరించింది. నల్లధనం వెలికితీతలో భాగంగా పన్ను ఎగవేతదారులకు స్వర్గధామాలైన దేశాలతో కేంద్రంలోని మోదీ సర్కా రు సమాచార మార్పిడి ఒప్పందాలను చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్విస్ ప్రభుత్వం నుంచి సమాచారాన్ని పొందుతున్నది. అయితే తమ బ్యాంకింగ్ వ్యవస్థ రక్షణార్థం ఖాతాదారుల సమ్మతితోనే ఈ సమాచార మార్పిడికి స్విస్ సర్కారు సిద్ధపడుతున్నది.

1815
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles