విధానాల్లో మార్పు రావాలి

Sun,February 10, 2019 01:01 AM

Starttps should provide the ideal conditions

-స్టార్టప్‌లకు అనువైన పరిస్థితుల్ని కల్పించాలి: ప్రభు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అనువైన పరిస్థితులను సృష్టించాల్సిన అవసరం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు అన్నారు. కొత్తవారిని ప్రోత్సహించడానికి పాత నిబంధనలను మార్చాల్సి ఉన్నదని అభిప్రాయపడ్డారు. దేశంలో స్టార్టప్‌లు విస్తరిస్తున్నాయి. యువ ఔత్సాహిక వ్యాపార, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. వీరికి అనువైన పరిస్థితులను ఏర్పరుచటానికి ఇప్పుడున్న నిబంధనల స్థానంలో కొత్త నిబంధనలను తీసుకురావాలి. సాంకేతికపరమైన అని శనివారం మంత్రి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా, పన్నుల విషయంలో స్టార్టప్‌లకు మినహాయింపులనిస్తున్నామన్న ఆయన.. పెట్టుబడులకు విస్తృత అవకాశాలను కల్పిస్తున్నామని చెప్పారు. పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య శాఖ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి తగు నిర్ణయాలు, సంస్కరణలు చేపడుతున్నట్లు వివరించారు. ఏంజిల్ ఇన్వెస్టర్ల ద్వారా వచ్చిన నిధులతోసహా మొత్తం పెట్టుబడులు రూ.10 కోట్లు మించని స్టార్టప్‌లకు గతేడాది పన్ను రాయితీలను అందించినట్లు ఈ సందర్భంగా సురేశ్ ప్రభు గుర్తుచేశారు. అయితే మొత్తం ఈ పన్ను నుంచి మినహాయింపును స్టార్టప్‌లు కోరుతున్నాయన్న ఆయన ప్రభుత్వం కూడా రూ.25-50 కోట్లదాకా మినహాయింపును పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

824
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles