స్పైస్‌జెట్‌లోకి 100వ విమానం

Mon,May 27, 2019 12:12 AM

SpiceJet poised to induct its 100th aircraft in less than 7 days

ముంబై, మే 26: చౌక విమానయాన సంస్థ స్పైస్‌జెట్ దూకుడు కొనసాగుతున్నది. కంపెనీ అమ్ముల పొదిలోకి 100వ విమానం ఆదివారం వచ్చిచేరింది. ఇలా వందకు పైగా విమానాలు కలిగిన సంస్థలో నాలుగో కంపెనీగా స్పైస్‌జెట్ రికార్డు సృష్టించింది. అంతకుముందు ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా, ఇటీవల మూతపడిన జెట్ ఎయిర్‌వేస్, మరో పోటి సంస్థయైన ఇండిగో ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్, గో-ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా, ఎయిర్‌ఏషియాల వద్ద 595 విమానాలు ఉన్నాయి. జెట్ ఎయిర్‌వేస్ తాత్కాలికంగా మూతపడటంతో విమాన సర్వీసుల సంఖ్యను పెంచుకునే పనిలో పడిన స్పైస్‌జెట్.. గడిచిన నెల రోజుల్లోనే 23 నూతన విమాన సర్వీసులను ఆరంభించింది.

ఐదేండ్లక్రితం తీవ్ర ఇబ్బందులు తట్టుకొని నిలిచిన సంస్థ..మళ్లీ గాడిలో పడిందని, 2019 నాటికి వంద విమానాలు కలిగిన కంపెనీగా అవతరించడం విశేషమని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ వెల్లడించారు. ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా సేవలు అందిస్తున్న స్పైస్‌జెట్ వద్ద ప్రస్తుతం 68 బోయింగ్ 737ఎస్‌లు ఉండగా, 30 బొంబార్డియర్ క్యూ400, రెండు బీ737 విమానాలు ఉన్నాయి. 62 ప్రాంతాల నుంచి రోజువారిగా 575 విమాన సర్వీసులు నడుపుతున్నది సంస్థ. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉడాన్ స్కీం కింద కూడా 42 రూట్లకు విమాన సేవలు అందిస్తున్నది.

632
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles