హైదరాబాద్-పుదుచ్చేరి మధ్య స్పైస్‌జెట్ విమాన సేవలు

Tue,July 18, 2017 12:25 AM

spicejet
హైదరాబాద్, జూలై 17: చౌక విమానయాన సంస్థ స్పైస్‌జెట్..హైదరాబాద్-పుదుచ్చేరిల మధ్య విమాన సర్వీసులను నడుపనున్నట్లు ప్రకటించింది. ప్రాంతీయంగా విమాన సేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వ సూచనమేరకు సంస్థ ప్రకటించిన మూడో సర్వీస్ ఇది. 78 మంది కూర్చోవడానికి వీలుండే విమానాన్ని వచ్చే నెల 16న ప్రారంభించనున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. వీటితోపాటు పాండిచ్చేరి నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, తిరుపతి, అహ్మదాబాద్, జైపూర్, ఛండీగఢ్, విజయవాడ, వారణాసిల మధ్య విమాన సేవలను త్వరలో ఆరంభించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

420

More News