Telangana Intermediate 1st & 2nd Year Results 2019

మార్కెట్లోకి స్పెరో ఈ-బైక్ సైకిళ్లు

Wed,September 21, 2016 01:12 AM

Spero to market the e-bike bicycle

-ప్రారంభ ధర రూ.29 వేలు
cycle హైదరాబాద్, సెప్టెంబర్ 20: కోయంబత్తూర్ కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న స్పెరో..దేశీయ మార్కెట్లోకి ఈ-బైకు సైకిళ్లను విడుదల చేసింది. మూడు రకాల్లో లభ్యమవనున్న ఈ సైకిళ్ల ప్రారంభ ధరను రూ.29 వేలుగా నిర్ణయించిన సంస్థ గరిష్ఠంగా రూ.47 వేలుగా నిర్ణయించింది. దీంట్లో ఈ-30 పేరుతో విడుదల చేసిన సైకిల్‌ను ఒకసారి చార్జ్ చేస్తే 30 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చునని కంపెనీ వర్గాలు తెలిపాయి. అలాగే ఈ-60 పేరుతో విడుదల చేసిన సైకిల్ ఒకసారి చార్జ్ ద్వారా 60 కిలోమీటర్లు, ఈ-100ని సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. కనీసం నాలుగు గంటలపాటు రీచార్జ్ చేయాల్సి ఉంటుంది. సైకిల్ తొక్కినప్పుడు సైతం బ్యాటరీ రీచార్జ్ అవనున్నది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చును.

ఇలాంటి నూతన ఆవిష్కరణలకోసం హైదరాబాద్‌కు చెందిన క్రౌడ్ ఫండెడ్ సంస్థ నిధులను సేకరించనున్నది. ఈ బైకుకోసం రూ.55 లక్షలు సేకరించినట్లు ఫ్యూయల్ ఏ డ్రీమ్ ఫౌండర్ రంగనాథ్ తెలిపారు. ఇప్పటి వరకు ఈ సైకిళ్ల కోసం 100కి పైగా బుకింగ్‌లు వచ్చాయన్నారు. ఈ వారంచివరి నుంచి బుకింగ్ చేసుకున్న వారికి సైకిళ్లను అందచేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

611
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles